Banana (అరటిపండు)
- బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకొన్నవారికి వచ్చే శక్తి, ì150 గ్రాముల మాంసముî తీసుకున్నా లేదా ìరెండు కోడి గ్రుడ్లుî తిన్నా లేదా ìఅర లీటరు పాలుî త్రాగిన వచ్చే శక్తి సమానం.
- మిగుల పండిన ఒక్క అరటిపండు = మూడు ఆపిల్ పండ్లు
అరటి పండుతో వైద్య చికిత్సలు:
- జీర్ణశక్తి సరిగా లేనివారు ప్రతిరోజు పండిన అరటి పండును తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది
- పాదములు చురుకు, మూత్రద్వారము మంట, కళ్ళుమంటలున్నవారు, అరటిపండును మజ్జిగ లో కలిపి తీసుకుంటే త్వరితముగా ఉపశమనం ఉంటుంది
- కడుపులో కురుపులు, మొలలు వున్నవారు పచ్చి అరటిపండును పాలతో ఉడికించి స్వీకరించాలి
- అరటి గింజలను మెత్తగా పొడిచేసి, తేనెతో కలిపి ప్రతిరోజు తింటే మసూచి వ్యాధి రాదు.
- ఏదిగే పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెరిగి, పోషక శక్తి తగినంత లభించడానికి అరటి పండు, పాలు, తేనె ఇవ్వాలి.
- గర్భిణి స్త్రీలు అనుదినము అరటిపండు స్వీకరిస్తే "గర్భకోశమునకు" ఆరోగ్యము చేకురి, "శిశువు" కూడా క్షేమముగా వుండును. రక్తహీనత కూడా తోలగును.
- ప్రతిరోజు నిద్రపోయే ముందు మిగులపండిన అరటికాయను తింటుంటే పురుషులుకు ఉన్న శీఘ్ర స్ఖలనములు, స్వప్న స్ఖలనములు, తాత్కాలిక నపుంసకత్వము సమస్యలు నివారింపబడతాయి
- హైపర్ ఎసిడిటితో బాధపడువారు అరటిపండు పాలలో కలిపి సేవించాలి
- రక్తమందు ఐరన్, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నవారు అవి భర్తీ అవడానికి ప్రతిరోజూ అరటిపండును తినాలి
- రక్తపోటు, ఆయాసము, గుండెజబ్బులున్నారు తేలిక ఆహారము క్రింద అరటిపండు తినవచ్చును. అరటి పండులో చాలా తక్కువ శాతములు క్రోవ్వు ఉంటుంది. దీనిలో కొలెస్టాల్ అసలు ఉండదు
- కాలేయ వ్యాధులు ఉన్నవారు, కామెర్లు వచ్చిన వారు కూడా అరటిపండు తినవచ్చును.
- మూత్రపిండముల వ్యాధులు కలవారు (పనిచేయనివారు) అరటిపండు తినకూడదు. దీనిలో పొటాషియం వారికి ఎంతో ప్రమాదం కలిగిస్తుంది.
- టి.బి బ్రాంకైటిస్ వ్యాధులు ఉన్నవారు అరటిపండు సేవించిన, చాల చక్కని ఉపయోగాలు ఉంటాయి
- రక్తమొలలు, మలబద్దకము, నిద్రలేమి, పొట్టనోప్పి ఉన్నవారు రాత్రి పండిన అరటి పండును తీసుకోవాలి
- అరటి పూలతో చికిత్సలు:
- విరోచనాలు అధికముగా అయ్యేవారు అరటిపూలను రసముతీసి, పెరుగులో కలిపి తింటే విరోచనాలు తగ్గిపోతాయి
- బహిస్టులో అధికముగా రక్తస్రావమయ్యే స్త్రీలు అరటి పూల రసాన్ని త్రాగితే రక్తస్రావము నిరోధింపబడును
- గనేరియా వ్యాధిగ్రస్తులు, మూత్రము సరిగా రానివారు అరటి పూలరసములో దోసకాయ రసమును కలిపి తీసుకోవాలి.
- మధుమేహము, ఆకలి మందగించుట, దగ్గు, మలబద్దకము లక్షణాలు ఉన్నవారు అరటిపూల రసం వాడటం మంచిది.
- అధికమైన శారీరిక బరువున్నవారు చెంచాడు అరటిపూలరసాన్ని పాలు, అరటిపండుతో కలిపి ప్రతిరోజూ 2 లేక 3 సార్లు చొప్పున 2 నెలలపాటు తీసికొంటుంటే బరువు తగ్గిపోతారు.
అరటి ఊచలతో చికిత్సలు:
- అరటి ఊచల నుండి తీసిన రసాన్ని ఒక గ్లాసు ఉదయముపూట వేసవి కాలంలో సేవిస్తే వడదెబ్బ తగలదు.
- మధుమేహం, కలరా, జ్వరములో అతి దాహ నివారణకు అరటి ఊచల రసం బాగా పనిచేస్తుంది
- మలబద్దకము కలవారు ప్రతిరోజు ఉదయమునే అరటి ఊచల రసం కొంచెం నెయ్యి కలిపి సేవించిన మలబద్దకం అంతరిస్తుంది.
- సెగ్గడ్డలు, కాలిన బొబ్బలకు, ఎండిన అరటి ఆకులను కాల్చి, దానిలో కొబ్బరి నూనె కలిపి, పైపూతగా వ్రాస్తే మంట, నొప్పి తగ్గి, గాయము త్వరితగతిన మానిపోతుంది
- ఎండిన అరటి ఆకులను కాల్చి, దానిలో కొబ్బరి నూనె, కొంచేము నిమ్మరసము, పసుపు కూడా జతచేసి, ఒంటికి పట్టించి, నులివెచ్చని నీటితో స్నానంచేస్తే శరీరముపై దురదులు అంతరిస్తాయి
Banana (అరటిపండు)
Reviewed by Unknown
on
9:25 AM
Rating:
Reviewed by Unknown
on
9:25 AM
Rating:


No comments: